రాష్ట్రంలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు (వీడియో)

18చూసినవారు
TG: రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో హైదరాబాద్‌లో ప్రజలు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడి పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయడంతో కొన్ని బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. పెట్రోల్ కొరత లేదని, భయాందోళనల కారణంగా తాత్కాలికంగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. అనవసరంగా నిల్వ చేసుకోవడం వల్లే సరఫరా అంతరాయం ఏర్పడుతున్నదని బంక్ యజమానులు చెబుతున్నారు.