కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్తలు అందించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ బ్యాలెన్స్‌పై వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. కార్మికశాఖ ఆమోదించిన ఈ రేటును ఆర్థికశాఖ త్వరలో ఆమోదించనుంది. మరోవైపు, కనీస పెన్షన్ పరిమితిని రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షన్ పెంపుపై కేంద్రం యోచిస్తోంది.