సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మల్గి గ్రామంలో రెడ్ కేటగిరీ పరిశ్రమ ఏర్పాటుపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కాలుష్యం వెదజల్లే ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు కలుషితమవుతాయని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.