
కష్టాలు చెప్పుకుని, దేవుడి ఫోటోకు మొక్కి.. నగదు అపహరించిన దొంగ!
AP: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. బిగ్ బజార్ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన దొంగ, క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫొటోకు మొక్కి, తన కష్టాలను చెప్పుకున్నట్లు కనిపించాడు. అనంతరం, సుమారు రూ.20 వేల నగదును అపహరించి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన రవితేజ నటించిన ఖడ్గం సినిమాలోని ఓ పాటను గుర్తు చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.




