థాయ్ లాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

14028చూసినవారు
థాయ్ లాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు
థాయిలాండ్‌ ప్రధాని పదవి నుంచి పేటోంగ్‌టార్న్ షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం తొలగించింది. అలాగే ఆమె మంత్రి వర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్ కాల్ లీక్ వ్యవహారంలో షినవత్రా ప్రధాని పదవిని కోల్పోయారు. షినవత్రా రాజ కుటుంబం నుంచి ఆరో ప్రధానమంత్రిగా పేటోంగ్‌టార్న్ ఏడాది క్రితమే నియమితులయ్యారు. కంబోడియాతో ఘర్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్