TG: ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.