ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Sep 26, 2025, 09:09 IST/

ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Sep 26, 2025, 09:09 IST
AP: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం రాత్రికి వాయుగుండంగా బలపడి, రేపు ఉదయం దక్షిణ ఒడిశా– ఉత్తరాంధ్ర తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం మొదలైంది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు ఐదు రోజులు పాటు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.