తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఆగస్టు చివరిలోపు అదనపు చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 600 మందికి పైగా స్టేట్‍మెంట్లు రికార్డు చేసిన సిట్, రాజకీయ నేతల పేర్లు చేర్చాలా వద్దా అనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటోంది. టెలిఫోన్ యాక్ట్ జోడించి చార్జిషీట్ వేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసులో కీలక సూత్రధారిగా గుర్తించారు.