ఫోన్ ట్యాపింగ్ కేసు.. గతంలో కేసీఆర్ ఏమన్నారంటే?

7చూసినవారు
TG: మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గతంలో కేసీఆర్ ఈ కేసుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 'సీఎంకు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధమే ఉండదు. ముఖ్యమంత్రులు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటారు. అధికారులు ఎలా వాటిని సేకరిస్తారనేది మాకెలా తెలుస్తుంది? ఇప్పటి సీఎం తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేయట్లేదా? ఈ కేసులో ఏమీ లేదు, ఇదంతా ట్రాష్' అని కొట్టిపారేశారు.

సంబంధిత పోస్ట్