ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారు: టీపీసీసీ చీఫ్

11చూసినవారు
ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారు: టీపీసీసీ చీఫ్
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో పలువురు సీఎంలు విచారణ ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం అసాధ్యమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :