జమ్ముకశ్మీర్‌లో పావురం కలకలం.. కాలికి పాక్ ఫోన్ నంబర్!

36చూసినవారు
జమ్ముకశ్మీర్‌లో పావురం కలకలం.. కాలికి పాక్ ఫోన్ నంబర్!
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ పావురం కలకలం రేపింది. పావురం కాలికి ఉన్న రింగ్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నంబర్‌ను స్థానికులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి పావురాన్ని పోలీసులకు అప్పగించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ నుంచి సందేశాలను చేరవేసేందుకు పావురాన్ని ఉపయోగించి ఉండొచ్చనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పావురం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్