జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు నియంత్రించాలంటూ పిల్

67చూసినవారు
జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు నియంత్రించాలంటూ పిల్
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు, నిరసనలు నియంత్రించాలంటూ పిల్ దాఖలైంది. వివిధ కారణాల దృష్ట్యా నిరసనలకు జంతర్‌మంతర్‌ సరైన ప్రదేశం కాదని న్యాయవాది పిల్ వేశారు. జంతర్‌మంతర్‌ వద్ద లోపలికి వెళ్లడం, రావడం సమస్యగా ఉందని, వైద్య సామగ్రి సరఫరా కూడా సక్రమంగా లేదన్నారు. పిల్ విషయంలో కేంద్రానికి, ఎన్‌డీఎంసీకి నోటీసు జారీ చేసిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్