అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్‌కు చెందిన కార్గో
విమానం రన్‌వే దాటి ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ పైలట్ కాక్‌పిట్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండగా అతడు
విమానం నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పరుగెత్తినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై
అమెరికా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.