హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురయ్యారు.
విమానం 30వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక పైలట్‌కు ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ముగ్గురు పైలట్లు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో అల్పాహారం తిన్నట్లు తెలుస్తోంది, ఫుడ్ పాయిజినింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.