
మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 25న బాబినా గ్రామంలోని ఇరుకైన వీధిలో నడుస్తున్న మహిళపై నల్ల ఎద్దు వెనుక నుంచి దాడి చేసింది. కొమ్ములతో ఎత్తిపడేసి గాలిలోకి విసరడంతో ఆమె నేలపై బలంగా పడి గాయపడింది. స్పృహ కోల్పోయిన మహిళను బైక్పై వెళ్తున్న వ్యక్తి గమనించి ఎద్దును తరిమేశాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.




