సమోసాలో పిన్నులు.. మిఠాయి దుకాణంపై ఆగ్రహం

17చూసినవారు
సమోసాలో పిన్నులు.. మిఠాయి దుకాణంపై ఆగ్రహం
మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని ఒక మిఠాయి దుకాణంలో సమోసాలు తింటున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సమోసాలలో పిన్నులు బయటపడటంతో దుకాణ నిర్వాహకుడితో గొడవపడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా సర్దుబాటు చేసుకున్నప్పటికీ, కొందరు యువకులు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఆహార భద్రతా అధికారులు నామమాత్రపు తనిఖీలు చేయడమే ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్