ఫ్లైఓవర్‌పై నుంచి ఊడిపడిన పైపు.. తప్పిన ప్రమాదం (వీడియో)

2చూసినవారు
TG: ఫ్లైఓవర్‌పై నుంచి రైన్ వాటర్ వెంట్ పైపు రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌పై పడటంతో ముందు భాగం నుజ్జునుజ్జైంది. హెల్మెట్ పెట్టుకోవడంతో బైకర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ షేక్‌పేట్‌లో  జరిగింది. స్కూటీ కొని కేవలం 15 రోజులే అయిందని బాధితుడు వాపోయాడు. గతంలోనూ ఇదే ఫ్లైఓవర్‌పై పైపులు ఊడిపడి వాహనదారులకు ప్రమాదం తప్పిన ఘటనలు ఉన్నాయి. వరుస ఘటనలతో ఫ్లైఓవర్ మెయింటెనెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైపులు, వెంట్స్‌ను వెంటనే తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్