ప్రో కబడ్డీ (PKL 2025)లో తెలుగు టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కాసేపట్లో పుణెరి పల్టాన్ జట్టును క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఎదుర్కోనుంది. గత 5 మ్యాచ్‌లలో పుణెరి పల్టాన్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. మరో వైపు ఫైనల్ చేరుకోవాలనే లక్ష్యంతో తెలుగు టైటాన్స్ బరిలోకి దిగుతోంది. ఇరు జట్లూ రైడింగ్, డిఫెన్స్‌లో బలంగా ఉన్నాయి. దీంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.