TG: రైతుల్లో నష్టాల భయాన్ని తొలగించడానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చి ప్రత్యేక పంట బీమా పథకం అమలు చేయాలని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ కొత్త సమగ్ర వ్యవసాయ విధానం-2026 నివేదికలో పేర్కొన్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతారని పేర్కొంది. ఇక ఈ కొత్త విధానం అమలైతే రైతుల ఆదాయం పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ సూచనలను అమలు చేయాలని రైతు సంఘాలూ కోరుకుంటున్నాయి.