అహ్మదాబాద్ విమాన ప్రమాదం వందల మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో దాదాపు 241 మంది మృతి చెందారు. అయితే హర్‌ప్రీత్ కౌర్ అనే మహిళ తన భర్త పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం లండన్ బయలుదేరుగా విమాన ప్రమాదంలో మృతి చెందింది. జూన్ 16న ఆమె భర్త రాబీ పుట్టినరోజు కావడంతో ముందుగా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా.. అది వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.