అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 15 పేజీల రిపోర్టును కేంద్రానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో బోయింగ్ స్పందిస్తూ, విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని, ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని బోయింగ్ పేర్కొంది.