అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో వడోదరలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే నీరజ్ లావానియా, అపర్ణ దంపతులు కూడా మృతి చెందారు. సెలవులను ఆనందంగా గడపడానికి బయలుదేరిన వారు కొన్ని నిమిషాల్లోనే మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చాలామంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మంటల్లో కాలిపోయాయి. మృతులను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.