బ్లూటూత్ పేరు దెబ్బకు.. యూటర్న్ తీసుకున్న విమానం

0చూసినవారు
బ్లూటూత్ పేరు దెబ్బకు.. యూటర్న్ తీసుకున్న విమానం
అమెరికాలోని న్యూజెర్సీ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానంలో, ఒక ప్రయాణికుడి బ్లూటూత్ డివైజ్ పేరు 'బాంబ్' అని ఉండటంతో సిబ్బంది కంగారుపడ్డారు. 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో బయల్దేరిన విమానంలో, బ్లూటూత్ ఆపాలని సూచించినా ఆ పేరుతో ఉన్న డివైజ్ యాక్టివ్‌గానే కనిపించింది. రెండు గంటల తర్వాత కూడా అది అలాగే ఉండటంతో, ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని వెనక్కి మళ్లించి నెవార్క్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్