
రూ. లక్షకు మగబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు!
TG: మహబూబ్నగర్ రూరల్ మండలం తెలుగుగూడెంలో కన్నబిడ్డనే విక్రయించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 16న జన్మించిన మూడో మగ శిశువును తల్లిదండ్రులు కేశవులు, నీలమ్మ లక్ష రూపాయలకు అమ్ముకున్నారు. టీకా కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు బాబు కనిపించకపోవడంతో, చనిపోయాడని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారించగా అసలు నిజం బయటపడింది. ఒక మధ్యవర్తి ద్వారా హన్వాడ మండలానికి చెందిన కొందరికి బాబును విక్రయించినట్లు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.




