
సచివాలయ, వార్డు ఉద్యోగుల పదోన్నతులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
AP: రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో సచివాలయ, వార్డు వ్యవస్థ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో పదోన్నతి ఛానెల్స్‌పై జీవో జారీ అయింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల వారికి ప్రమోషన్లు లభించనున్నాయి. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆమోదం తెలిపారు. మరో రెండు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన నిబంధనలు త్వరలోనే జారీ చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.




