
రాత్రి లవంగం తింటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
రాత్రి పడుకునే ముందు లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం లవంగాలు ఒత్తిడిని తగ్గించి, గాఢ నిద్రకు సహాయపడతాయి. ఇవి విషాన్ని తొలగించడంలో, జలుబు, దగ్గు, నోటి దుర్వాసన, పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా లవంగం నీరు మేలు చేస్తుంది. అయితే వీటిని పరిమితంగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించాలి.




