TG: రైతులు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని, రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ అన్నారు. రైతు సంగ్రామ సదస్సులో ప్రభుత్వానికి పంపిన తీర్మానలను తెలియజేశారు. '
కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. రైతు డిక్లరేషన్ లోని హామీలు అమలు చేయాలి. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి. రైతు బంధు, రుణమాఫీ, బోనస్, రైతు భీమా పథకాలు పూర్తిగా అమలు చేయాలి' అని అన్నారు.