‘ప్లీజ్.. దయచేసి మద్యం టెండర్లు వేయండి’

32చూసినవారు
‘ప్లీజ్.. దయచేసి మద్యం టెండర్లు వేయండి’
మహబూబ్‌నగర్‌లో మద్యం టెండర్లకు ఆశించిన స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 2023లో 8,128 అప్లికేషన్లు రాగా, ఈసారి ఇప్పటివరకు కేవలం 278 టెండర్లు మాత్రమే వచ్చాయి. ఈ సంఖ్యను పెంచుకోవడానికి అధికారులు గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేసి, బతిమిలాడుకుంటున్నట్లు సమాచారం. మద్యం వ్యాపారంపై ఆసక్తి తగ్గడం లేదా ఇతర కారణాలు ఈ పరిస్థితికి దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్