నవంబర్‌లోనే పీఎం కిసాన్ నిధుల విడుదల!

160చూసినవారు
నవంబర్‌లోనే పీఎం కిసాన్ నిధుల విడుదల!
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేల చొప్పున మూడు( ఒక్కో విడతకు రూ.2000) విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 21వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నిధులను ఈ నెలలోనే (నవంబర్) విడుదల చేయాలని కేంద్ర ప్రభత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దేశంలోని 8.5 కోట్ల మంది అర్హులైన రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం డబ్బులు బ్యాంకులో జమకావాలంటే లబ్ధిదారులు e-KYCని పూర్తి చేయాలి.