పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో 24వ విడత నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియను మొదలుపెట్టినట్లు సమాచారం. అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ రానుండగా.. అక్టోబర్ 17న పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. దీంతో పండక్కి ముందే అకౌంట్లలో డబ్బులు(రూ.2,000) పడనుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.