పీఎం కిసాన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో దీపావళికి ముందు 21వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7 వేల మంది రైతులకు ఈసారి డబ్బులు రాకపోవచ్చ. ఏపీలో 600 మందికి, తెలంగాణలో 6 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో 20వ విడత నిధులు జమ కాలేదు. బ్యాంక్ లేదా ఆధార్ లింక్ లోపాలు, రికార్డ్ పొరపాట్లు కారణంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడైన రైతులు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోకపోతే మళ్లీ ఈ స్కీమ్ నగదు జమ కాకపోవచ్చు.