రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది ఉత్సవాలను దిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తేవడానికి ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని ప్రశంసించారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం ఎప్పుడూ గెలుస్తాయని అన్నారు.