ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.