
భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా (వీడియో)
చైనా మరో మైలురాయిని చేరింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన భారీ విమాన వాహక నౌక ‘ఫుజియాన్’ను అధికారికంగా ప్రారంభించింది. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో జరిగిన వేడుకలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా నౌకను పరిశీలించారు. సుమారు 316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు కలిగిన ఈ యుద్ధ నౌక దాదాపు 50 యుద్ధ విమానాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినదిగా సమాచారం. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న మొదటిది నౌకగా నిలిచింది.




