
కాలేజీ భవనం పైనుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణ కాలేజీ భవనం పైనుంచి దూకి.. చంద్రగిరి మండలం అగరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి మహిధర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక మూడు అంతస్తుల భవనం పైనుంచి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మహిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి స్నేహితులు, కాలేజీ సిబ్బంది అతడిని అమర హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.




