ప్రధాని మోదీ శనివారం మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023 నుంచి మొదలైన అల్లర్ల తర్వాత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం అవుతారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించినున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.