ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో రేపు ఎంతో కీలకమైన రోజని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఇంధన, కమ్యూనికేషన్, హెల్త్ కేర్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. రెండు మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం మోదీ త్రిపురలో పర్యటించనున్నారు.