బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా బీహార్ ప్రజలను ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను ఉద్దేశిస్తూ “మొదట ఓటు వేయండి, ఆ తర్వాతే పలహారం తీసుకోండి” అని ఆకట్టుకునే సందేశం ఇచ్చారు.