వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ, సామాజిక భద్రత కల్పిస్తున్న పీఎం స్వనిధి పథకం విజయవంతంగా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచింది. లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడైంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన పథకం.