పేదల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏడాదికి కేవలం రూ.20 (నెలకు సుమారు 1.67 పైసలు) చెల్లిస్తే చాలు, ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా రూ2 లక్షలు బీమా కవరేజ్ లభిస్తుంది. పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు అందజేస్తారు. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా, యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉంటే ఈ పథకాన్ని పొందవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది, కాబట్టి రెన్యువల్ చేసుకోవడం ముఖ్యం.