ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jun 04, 2026, 01:06 IST/

VIDEO: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

Jun 04, 2026, 01:06 IST
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు పది మంది రోగులు సజీవదహనమైనట్టు అధికారులు తెలిపారు. ఐదవ అంతస్తులోని ఐసీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా రోగులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి, రోగులను సురక్షితంగా తరలించారు. రక్షించిన పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సివుంది.