పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మూడో రోజుకి చేరాయి. రహదారులపై బలగాలు కంటైనర్లు పెట్టినా, ఆందోళనకారులు వాటిని తొలగించి నదిలో పడేశారు. హింసాత్మకంగా మారిన నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనలో మార్కెట్లు, షాపులు మూతపడ్డాయి. పీవోకే శరణార్థుల రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.