రష్యా డ్రోన్లు పోలండ్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ హెచ్చరించడంతో పోలండ్ సాయుధ బలగాలు వెంటనే స్పందించి రష్యా డ్రోన్లను కూల్చివేశాయి. ఈ ఘటనపై నాటో సెక్రటరీ జనరల్‌కు సమాచారం అందించినట్లు పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా నాలుగు విమానాశ్రయాలను మూసివేసిన పోలండ్, మిలిటరీని హై అలర్ట్‌లో ఉంచింది.