ఆధార్ ఓటీపీలతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌: పోలీసులు అలెర్ట్‌

10976చూసినవారు
ఆధార్ ఓటీపీలతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌: పోలీసులు అలెర్ట్‌
ఆధార్ వివ‌రాల విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆధార్ నంబ‌ర్ ఆధారంగా సైబ‌ర్ నేరాలు ఎక్కువ అవుతుండ‌టంతో పోలీసులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎక్కడపడితే అక్కడ ఆధార్ వివరాలు ఇవ్వొద్ద‌ని హెచ్చ‌రించారు. ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు గానీ, వినియోగించుకునేందుకు గానీ ఎవరికీ ఓటీపీ చెప్పొద్ద‌న్నారు. అపరిచిత సైట్లలో ఆధార్‌కార్డు వివరాలు ఇవ్వడం ద్వారా సైబర్ మోసాలకు గురికావొచ్చ‌ని హెచ్చ‌రించారు.

సంబంధిత పోస్ట్