హరీశ్‌రావును అరెస్టు చేసిన పోలీసులు

7చూసినవారు
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర హైడ్రామా నడుస్తోంది. మంత్రులతో చర్చ కోసం కాలినడకన గన్ పార్క్ కు బయల్దేరిన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరగగా హరీష్ రావు కింద పడిపోయారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా పోలీసుల పహారాలో ఉన్నమా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఏం సాధిస్తారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్