హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాలను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం నాడు అక్కడే కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలిపారు. సిట్ నోటీసులపై కేసీఆర్ కాసేపట్లో స్పందించనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.