ఇందిరమ్మ ఇల్లు అడిగినందుకు వ్యక్తిపై పోలీసుల దాడి (వీడియో)

5679చూసినవారు
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేసి, స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. జటప్రోలు గ్రామానికి చెందిన కాటికే నారాయణ అనే వ్యక్తి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించడానికి వెళ్లినప్పుడు, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. కలెక్టర్‌కు అవమానం జరిగిందని ఆగ్రహించిన కొందరు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అదే రోజు సాయంత్రం పోలీసులు నారాయణను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారు.

సంబంధిత పోస్ట్