మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దారుణం: KTR

4420చూసినవారు
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దారుణం: KTR
TG: MGM ఆస్పత్రిలో పెచ్చులూడి గాయపడ్డ రోగుల్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసులు దాడి చేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన నేతను అడ్డుకోవడమే కాక కడుపులో తన్నడం, చేయి విరిగేలా దాడి చేయడం అత్యంత గర్హనీయమని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్