సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు(వీడియో)

2చూసినవారు
TG: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిరుద్యోగులు సిద్ధమయ్యారు. ఈ మేరకు HYD – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహాధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపల నిరుద్యోగులను నిర్బంధించి మెయిన్ గేట్లకు పోలీసులు తాళం వేశారు. మమ్మల్ని నమ్మించి రేవంత్ అధికారంలోకి వచ్చాడని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కోదండరాం, బల్మూరి వెంకట్ మమ్మల్ని వాడుకొని పదవులు పొందారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్