స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, CAPFలో 3,073 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు ఆగస్టు 2, 2002కు ముందు, ఆగస్టు 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. అక్టోబర్ 16 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.